పామూరు పట్టణంలోని శ్రీహరి హర పుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రంలో అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా ఆలయాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఉగ్రను ఆశీర్వదించిన వేదపండితులు , స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. బిజెపి నియోజకవర్గ కన్వీనర్ వెంకటరమణయ్య, టిడిపి నాయకులు పాల్గొన్నారు.