పీసీపల్లి మం. వెంగళాపురం సమీపంలోని శ్రీపాలేటి గంగమ్మ తిరునాళ్లకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు కనిగిరి డీఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఈ నెల 16న జరిగే తిరునాళ్లకు 9 ప్రభలు, ఒక కోలాటానికి అనుమితిచ్చామన్నారు. వాహనాదురులు కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేయాలని చెప్పారు.