మిచోంగ్ తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తం ఉండాలని మునిసిపల్ కమీషనర్ డి. వి. ఎస్ నారాయణరావు అన్నారు. సోమవారం కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో మునిసిపల్, సచివాలయ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. కమీషనర్ మాట్లాడుతూ తుఫాన్ కు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. మురుగు నీటి ప్రవాహనికి ఆటంకం లేకుండా చూడాలని శానిటరీ సెక్రటరీలకు సూచించారు.