ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పామూరు పట్టణాన్ని శనివారం స్థానిక పోలీసులు డ్రోన్ సహాయంతో ప్రత్యేకంగా పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పేకాట, కోడి పందాలు, అల్లర్లకు చెక్ పెట్టవచ్చని పోలీసులు అన్నారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు పామూరు ఎస్సై తెలిపారు.