కనిగిరి పట్టణంలోని ఏబీయం కాంపౌండ్ లో పారిశుద్ధ్యం అద్వాన్నంగా తయారైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున చెత్త, వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్గంధం వెదజల్లుతూ ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చెత్త, వ్యర్థాలను సక్రమంగా తొలగించడం లేదని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పారిశుద్ధ్య సిబ్బందిచే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.