ప్రకాశం జిల్లా కనిగిరిలో బుధవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారి ఈదురుగాలులతో వర్షం పడింది. గత కొన్ని రోజులుగా వేడితో ఇబ్బందిపడ్డ ప్రజలకు వాతావరణం చల్లబడటం కొంత ఉపశమనం ఇచ్చింది. ఎండకు అలసిపోయిన వారికి ఈ వర్షంతో తాత్కాలిక ఉపశమనం లభించినట్లు అయింది. మరోవైపు ఈ వర్షంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.