హనుమంతునిపాడు మండలంలోనూ రిలయన్స్ బయోగ్యాస్ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి గంగమ్మ తల్లి సమేత గరటయ్య స్వామి తిరుణాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మండలంలో రిలయన్స్ బయోగ్యాస్ ఇండస్ట్రీ ఏర్పాటు వల్ల రైతులకు ఎకరానికి రూ. 30 వేలు కౌలు, యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.