కనిగిరిలో ఆక్రమణలు తొలగింపు

68చూసినవారు
కనిగిరి పట్టణంలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం మళ్లీ మొదలైంది. ఇప్పటికే రెండు పర్యాయాలు పట్టణంలోని రహదారులకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించారు. తాజాగా శుక్రవారం పట్టణంలోని ఎమ్మెస్సార్ రోడ్డులో రహదారులకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను జెసిబి సహాయంతో తొలగించారు. తొలగింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్