పాములలో లాడ్జిలను తనిఖీ చేసిన ఎస్ఐ

52చూసినవారు
పాములలో లాడ్జిలను తనిఖీ చేసిన ఎస్ఐ
పామూరులో లాడ్జిలను, డార్మిటరీలను పామూరు ఎస్సై కిషోర్ బాబు శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జీలలో ప్రతి గదిని క్షుణంగా పరిశీలించారు. రాత్రి వేళలో లాడ్జిలలో బస చేసిన వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. లాడ్జిలలో బస చేసిన వ్యక్తుల వివరాలు, ఆధార్ కార్డు కచ్చితంగా రిజిస్టర్లో నమోదు చేయాలని యాజమాన్యానికి సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు తనిఖీలు చేస్తున్నట్లుగా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్