సీఎస్ పురం మండలంలోని అంబవరం కొత్తపల్లిలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం భైరవకోనలో ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భైరవకోనను సందర్శించి సుందరమైన జలపాతంలో స్నానం చేసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నగరేశ్వర, త్రిముఖ దుర్గాదేవి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.