కనిగిరి మండలంలో పలు గ్రామాలకు గత కొన్ని రోజుల నుంచి సాగర్ నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాలలోని ప్రజలు కనిగిరిలోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని సాగర్ నీటి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.