ప్రకాశం జిల్లా కొమరోలులో శనివారం స్వచ్ఛఆంధ్ర - దివస్ కార్యక్రమాన్ని ఎంపీడీవో మస్తాన్ వలి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామపంచాయతీలో కార్యక్రమాన్ని విధిగా నిర్వహించి ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమ వంతు కృషి చేయాలని సచివాలయ పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ బ్రహ్మయ్య సిబ్బంది పాల్గొన్నారు.