టీటీడీ గోశాలపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నాయకులు అన్నారు. శనివారం కనిగిరి టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ టీటీడీ గోశాలలో వందల గోవులు మృతి చెందుతున్నాయని భూమన అసత్య ఆరోపణలు చేశారన్నారు. వైసీపీ పాలనలో టీటీడీని భ్రష్టు పట్టించి, గోశాలపై అసత్య ఆరోపణలు చేస్తూ ఆ నెపాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై నెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోమన్నారు.