కనిగిరి మండలం వంగపాడులో మాజీ సర్పంచ్ రావులపల్లి వెంకటరత్నం గతంలో టీడీపీ జెండా దిమ్మెను ఏర్పాటు చేయగా, అప్పటి మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి దానిని ఆవిష్కరించారు. అయితే ఈ జెండా దిమ్మెకు ఉన్న శిలాఫలకాన్ని గుర్తు తెలియని దండగలు ధ్వంసం చేసి పక్కన పడేశారు. గుర్తు తెలియని దుండగులు చేశారని, టీడీపీ నాయకులు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.