కనిగిరి టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పార్టీ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. కనిగిరి నియోజకవర్గంలో ఏడాది సుపరిపాలన అభివృద్ధిపై కరపత్రాలను ఆవిష్కరించి పార్టీ నాయకులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేస్తుందన్నారు.