ఎడ్ల పందాలను ప్రారంభించిన టీడీపీ నాయకులు

83చూసినవారు
ఎడ్ల పందాలను ప్రారంభించిన టీడీపీ నాయకులు
హనుమంతునిపాడు మండలంలోని మంగంపల్లిలో మంగమ్మ తల్లి సమేత గరటయ్య స్వామి తిరుణాల సందర్భంగా రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. మండల టీడీపీ అధ్యక్షులు సానికొమ్ము తిరుపతిరెడ్డి పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు తమ ఎడ్లతో వాటి యజమానులు హాజరయ్యారు. ఉత్సవాల్లో మూడు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్