కనిగిరి కాస్మోపాలిటన్ క్లబ్‌లో ఆదివారం మంత్లీ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నీలో కనిగిరి సీఐ షేక్ ఖాజావలి, మాల్యాద్రి జట్టు 6-2 స్కోరుతో సత్యనారాయణ, బాషాలపై విజయం సాధించింది. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయనే అభిప్రాయాన్ని క్రీడాకారులు వ్యక్తం చేశారు.