పేదలకు భూములు పంపిణీ చేసిన ఘనత పీవీకే దక్కుతుంది

73చూసినవారు
పేదలకు భూములు పంపిణీ చేసిన ఘనత పీవీకే దక్కుతుంది
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకను శుక్రవారం కనిగిరి వికలాంగుల హక్కుల కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ధూళిపాళ్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రిగా పీవీనరసింహారావు ఆర్థిక సంస్కరణలు దేశానికి ఆదర్శమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన కాలంలో భూ సంస్కరణలు తీసుకువచ్చి వేలాది భూములను పేదలకు పంపిణీ చేసిన ఘనత పీవీకె దక్కుతుందన్నారు.

సంబంధిత పోస్ట్