తాసిల్దార్ కార్యాలయంలో దస్త్రాలు మాయం

81చూసినవారు
తాసిల్దార్ కార్యాలయంలో దస్త్రాలు మాయం
సీఎస్ పురం మండలంలోని వీరం జీపురం, పెదగోలపల్లి రెవెన్యూ గ్రామలకు సంబంధించిన దస్త్రాలు తాసిల్దార్ కార్యాలయం నుంచి మాయం అవడం కలకలం రేగుతుంది. బుధవారం రైతులు మాట్లాడుతూ కొందరు రెవెన్యూ అధికారులు వీఆర్వోలు దస్త్రాలను కావాలనే మాయం చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల సీఎస్ పురానికి వచ్చిన జేసీ గోపాలకృష్ణకు ఈ ఘటనపై రైతులు ఫిర్యాదు చేశారు. దస్త్రాలు మాయం అవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్