కనిగిరి: గాలివానకు నెలకొరిగిన మహావృక్షాలు

59చూసినవారు
కనిగిరి: గాలివానకు నెలకొరిగిన మహావృక్షాలు
కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పెద్ద చెర్లోపల్లి మండల కేంద్రంలో శనివారం భారీగా ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన దంచికొట్టింది. గాలుల ధాటీకీ మండలంలోని ప్రధాన రహదారుల వెంట మహా వృక్షాలు విరిగి నెలకొరిగాయి. మండల పరిధిలోని పలు గృహాలపై ఉన్న రేకులు ఎగిరిపడ్డాయి. స్థానిక పశు వైద్య కేంద్రం వద్ద నున్న భారీ వృక్షం కూలిపోయింది. పలు చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్