హనుమంతునిపాడు మండలంలోని వేములపాడులో బాణసంచా దుకాణాలను ఎస్ఐ కే మాధవరావు పోలీస్ సిబ్బందితో కలిసి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణదారుల లైసెన్స్, స్టాక్ వివరాలను ఎస్ఐ పరిశీలించారు. పరిమితికి మించి అక్రమంగా బాణసంచా నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను ఎస్ఐ హెచ్చరించారు. అక్రమ బాణసంచా విక్రయాలపై చర్యలు తప్పవన్నారు.