కనిగిరిలోని పొగాకు వేలం కేంద్రాన్ని టొబాకో బోర్డు చైర్మన్ చెడిపోతు యశ్వంత్ కుమార్, వైస్ చైర్మన్ బోడపాటి బ్రహ్మయ్య శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య, బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా వారిని కలిశారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. బీజేపీ నాయకులు జాజం చిన్న సుబ్బయ్య ఉన్నారు.