కనిగిరి పొగాకు వేలం కేంద్రంలో గురువారం పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కనిగిరి మండలం చాకిరాల గ్రామంలోని రైతులు కష్టపడి పండించిన పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, బయ్యర్లు ఏకమై పొగాకు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది.