నేడు దుకాణాల నిర్వహణకు వేలం

77చూసినవారు
నేడు దుకాణాల నిర్వహణకు వేలం
చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామంలో కొలువైన ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో సోమవారం షాపుల నిర్వహణకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి నారాయణరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ రూ. 500 రూపాయలు చెల్లించి టెండర్ షెడ్యూల్ ఫామ్ ను పొందిన తర్వాత వేలంపాటలో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకే ఆలయానికి
చేరుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్