ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో పనిచేస్తున్న మంచి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి కోరారు. శనివారం వెలిగండ్ల టీడీపీ కార్యాలయంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.