అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న తెల్ల రాయి

58చూసినవారు
పెదచెర్లోపల్లి మండలంలోని అలవలపాడు రెవెన్యూ పరిధి కొత్తపల్లి గ్రామంలోని పొలాల్లో అక్రమంగా తరలించేందుకు భారీగా వైట్ క్వార్ట్జ్ రాళ్లను సిద్ధం చేశారు. విదేశాల్లో వైట్ క్వార్ట్జ్ రాళ్లకు భారీ గిరాకీ ఉండడంతో పొలాల్లో ఈ విధంగానే అక్రమ తరలింపుకు డంప్ చేశారు. మైనింగ్ అధికారులు దృష్టి సారించి, అక్రమంగా నిలువచేసిన వైట్ క్వార్ట్జ్ రాళ్లను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్