కనిగిరి పట్టణంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రత వేడుకలు ఆలయాల్లో ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని దంతులమ్మ ఆలయంలో కొలువైయున్న శ్రీ పోలేరమ్మ తల్లి సన్నిధిలో లక్ష్మీదేవికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి పండితులు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు పండితులు ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.