యువతకు ఉద్యోగాలు వస్తాయి: కనిగిరి ఎమ్మెల్యే

50చూసినవారు
వెలిగండ్ల గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవానికి కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భూమిని ఎవరు అమ్ముకోవద్దని, రిలయన్స్ బయో గ్యాస్ కంపెనీ నిర్మించాక యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో బయోగ్యాస్ కంపెనీలను ఓపెన్ చేస్తారని, రైతులకు కౌలు ఇస్తారన్నారు.

సంబంధిత పోస్ట్