కౌలు రైతు కార్డులకు దరఖాస్తు చేసుకోండి

61చూసినవారు
కౌలు రైతు కార్డులకు దరఖాస్తు చేసుకోండి
జరుగుమల్లి మండలంలో కౌలుకు భూమి తీసుకొని సాగు చేస్తున్న రైతులు కౌలు రైతు కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి యుగంధర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం కౌలుకు తీసుకున్న భూములకు సంబంధించిన అగ్రిమెంట్, ఆధార్ కార్డ్, ఫొటో, పట్టాదారు పుస్తకం, కౌలుకు తీసుకొనే వారి ఆధార్ కార్డు ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్