ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. సునీల్ అనే వ్యక్తికి చెందిన పూరిల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతి అయింది. దీంతో దాదాపు రూ. 3 లక్షలు విలువచేసే సామగ్రి కాలిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకునే లోపే పూరి గుడిసె అగ్నికి ఆహుతి అయింది. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.