రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన గురువారం జరిగింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె. బిట్రగుంట సమీపంలో మామిడికాయల లోడుతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో నెల్లూరు జిల్లా చెన్నయ్యపాలెం కు చెందిన శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.