కొండేపి సీఐ సోమశేఖర్, ఎస్ఐ ప్రేమ్ కుమార్, సిబ్బంది కలిసి బొమ్మల సెంటర్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ట్రాక్టర్లలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కూలీలు సైడ్ డోర్లు ఓపెన్ చేసి ప్రయాణం చేయకూడదని అన్నారు. ఎవరైనా ట్రాక్టర్లో అనధికారికంగా కూలీ వాళ్ళను ఎక్కించుకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్, ట్రాక్టర్ ఓనర్ కూడా ముద్దాయిగా చేర్చి కేసులు నమోదు చేస్తామన్నారు.