ఎవరిపై ఆధారపడకుండా వైఎస్ జగన్ సొంతగా పార్టీ స్థాపించి సీఎం స్థాయికి ఎదిగారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం కొండపిలో ఆయన మాట్లాడారు. ఎవరి దగ్గర నుంచి ఆయన పార్టీ లాక్కోలేదని టీడీపీపై పరోక్ష విమర్శలు చేశారు. సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ని పులివెందుల ఎమ్మెల్యే అని కొందరు వ్యాఖ్యానిస్తుండటాన్ని ఖండించారు.