ప్రకాశం జిల్లా కొండేపి మండలం పెట్లూరు సమీపంలోని దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామితో పాటు మారిటైం స్టేట్ చైర్మన్ దామచర్ల సత్య సందర్శించారు. ఏకాదశి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలలో మంత్రి స్వామి పాల్గొన్నారు. అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు స్వీకరించారు. తర్వాత దామచర్ల సత్య ను మంత్రి స్వామిని అర్చకులు సన్మానించారు.