కొండపి: 439 పొగాకు బేళ్లు కొనుగోలు

65చూసినవారు
కొండపి: 439 పొగాకు బేళ్లు కొనుగోలు
కొండపి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం వేలంపాట నిర్వహించారు. పొగాకు సరాసరి ధర కేజీ రూ. 254. 78గా నిర్ణయించినట్లు వేలం నిర్వహణ అధికారి జి. సునీల్ కుమార్ తెలిపారు. కామేపల్లి, పచ్చవ గ్రామాలకు చెందిన రైతులు 598 బేళ్లను వేలానికి తీసుకుని వచ్చినట్లు చెప్పారు. వాటిలో 439 బేళ్లను కొనుగోలు చేయగా, వివిధ కారణాలతో 159 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ట, కనిష్ఠ ధరలు వరుసగా కేజీ రూ. 280, రూ. 230గా నమోదయ్యింది.

సంబంధిత పోస్ట్