కొండపి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వేలంలో 140 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ తెలిపారు. రైతులు 762 బేళ్లను వేలానికి తీసుకురాగా 622 బేళ్లు కొనుగోలు అయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 140 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ట ధర కేజీ రూ 280, కనిష్ట ధర కేజీ రూ. 180, సరాసరి ధర కేజీ రూ. 251. 73 గా నమోదయింది. వేలంలో వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.