కొండేపి: 635 పొగాకు బేళ్లు కొనుగోలు

0చూసినవారు
కొండేపి: 635 పొగాకు బేళ్లు కొనుగోలు
కొండేపి పొగాకు వేలం కేంద్రంలో శనివారం నిర్వహించిన వేలంలో 237 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వేలం నిర్వహణ అధికారి జి. సునీల్ కుమార్ తెలిపారు. రైతులు 872 బేళ్లను వేలానికి తీసుకుని వచ్చారు. అందులో 635 బేళ్లు కొనుగోలు అయ్యాయి. వ్యాపారుల వివిధ కారణాలతో 237 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ట ధర కేజీ రూ. 280, కనిష్ట ధర కేజీ రూ. 160, సరాసరి ధర కేజీ రూ. 228.45 గా నమోదయిందని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్