ప్రకాశం జిల్లా కొండేపి పొగాకు వేలం కేంద్రాన్ని శనివారం రీజనల్ మేనేజర్ రామారావు ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు అన్ని రకాల గ్రేడ్ కు సంబంధించిన పొగాకును కొనుగోలు చేయాలని రీజినల్ మేనేజర్ కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి రైతుల సమస్యను దృష్టికి తీసుకువెళ్లి అన్ని రకాల పొగాకు కొనుగోలు చేసే విధంగా చూస్తారని రామారావు హామీ ఇచ్చారు.