కొండపి: వేలం కేంద్రాన్ని సందర్శించిన రీజినల్ మేనేజర్

66చూసినవారు
కొండపి: వేలం కేంద్రాన్ని సందర్శించిన రీజినల్ మేనేజర్
పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ లక్ష్మణరావు కొండపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. గిట్టుబాటు ధరలు కల్పించడం లేదంటూ గురువారం స్థానిక రైతులు వేలం కేంద్రం వద్ద నిరసనకు దిగారు. ఈ విషయం లక్ష్మణరావు దృష్టికి రావడంతో అక్కడికి చేరుకొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోజురోజుకు పొగాకు ధరలు పతనం అవుతున్నాయని లక్ష్మణరావుకు మొరపెట్టుకున్నారు. రైతులకు న్యాయం చేస్తానని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్