ప్రకాశం జిల్లా మర్రిపూడి, కొండపి మండలాల్లో ఆదివారం సాయంత్రం సమయంలో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. పందిళ్లలో నిల్వ ఉంచిన పొగాకు వాన చినుకులలో తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం ఒక్కసారిగా మారడంతో పొగాకును కాపాడుకునే అవకాశం లేకపోయిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.