మహిళలంటే వైకాపాకు గౌరవం లేదని ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మంత్రి స్వామి అమరావతి మహిళలను అగౌరవపరచడంపై అసహనం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారిపై ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారని వారిని సజ్జల సమర్ధించడం ఎంతవరకు సబబు అని వైకాపాకు మంత్రి స్వామి కౌంటర్ ఇచ్చారు.