ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఆదివారం పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుకున్న సదుపాయాలను పరిశీలించి అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగిందని మంత్రి స్వామి అన్నారు. విద్యార్థులకు సకాలంలో ఆహారం అందించాలని తెలిపారు.