సింగరాయకొండలో పాత సామగ్రి చోరి

60చూసినవారు
సింగరాయకొండలో పాత సామగ్రి చోరి
సింగరాయకొండ పంచాయతీలోని పాత సామాగ్రి చోరీకి గురైనట్లుగా ఈవో ఆర్డీ సుధాకర్ మంగళవారం తెలిపారు. పంచాయతీలో తాత్కాలిక పారిశుద్ధ కార్మికులు విధులు నిర్వహిస్తున్న తన్నీరు శివ, నాగరాజు కార్యాలయంలో నిలువ ఉంచిన పాత సామాగ్రిని దోచుకెళ్ళినట్లుగా తెలిపారు. వాటి విలువ రూ. 2 లక్షలు ఉంటుందని ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈఓఆర్డి తెలిపారు. జరిగిన చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్