పొన్నలూరు మండలంలో అర్హులు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తహశీల్దార్ పుల్లారావు కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కొత్త కార్డులు, సభ్యుల చేరిక, విభజన, తొలగింపు, చిరునామా మార్పు, ఆధార్ సీడింగ్ సవరణ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో గ్రామ సచివాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.