ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం రావులకొల్లు గ్రామంలో అప్రకటిత కరెంటు కోతలతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అసలే ఉక్క పోతతో సతమతమవుతున్న స్థానికులు కరంటు కోతలతో రాత్రయితే కంటి మీది కునుకు ఉండటం లేదని కరెంటు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రావులకొల్లు, వేంపాడు, ఉప్పలదిన్నె గ్రామాలకు సక్రమంగా కరెంటు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.