సింగరాయకొండలో పొట్టేళ్ల పోటీలు

81చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో వరాహ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం బ్రహ్మోత్సవాలలో భాగంగా పొట్టేళ్ల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. సాంప్రదాయ బద్ధంగా నిర్వహించే ఈ పోటీలలో విజయం సాధించే పొట్టేళ్ల యజమానులకు నగదు బహుమతులను అందజేస్తామని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్