సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సింగరాయకొండ సిఐ హజరతయ్యా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుధవారం స్టేషన్ ఆవరణలో పోలీసు సిబ్బందితో కలిసి ఆయన గోడ పత్రికను ఆవిష్కరించారు. సమస్యాత్మకమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగతనాలు అరికట్టడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టవచ్చని ప్రజలకు సీఐ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎస్ఐలు పాల్గొన్నారు.