సింగరాయకొండ: లావాదేవీల విషయంలో దాడి

81చూసినవారు
సింగరాయకొండ: లావాదేవీల విషయంలో దాడి
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం శానంపూడిలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తలపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. గతంలో ఇచ్చిన డబ్బుల లావాదేవీల విషయంలో వివాదం తలెత్తి ఈ దాడి జరిగినట్లుగా బాధితులు వెల్లడించారు. భార్యాభర్తలకు గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిని స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు పరామర్శించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్