సింగరాయకొండ: రెచ్చిపోయిన దొంగలు

53చూసినవారు
సింగరాయకొండ: రెచ్చిపోయిన దొంగలు
సింగరాయకొండ మండలం బైరాగిమాన్యంలో చోరీ జరిగింది. దొంగలు రూ. 25వేల నగదును అపహరించుకెళ్లారు. పోలీసు కథనం మేరకు. భైరాగి మాన్యంకు చెందిన రాజు సుబ్బారెడ్డి ఈనెల 5న భార్యతో కలిసి తిరుపతి వెళ్లారు. తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చారు. ప్రధాన ద్వారం తాళం పగులకొట్టి ఉండటాన్ని గుర్తించారు. దీంతో ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన చేరుకున్న ఎస్ఐ మహేంద్ర జరిగిన చోరీ ఘటనపై విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్