ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నూతనంగా నిర్మిస్తున్న కోర్టును శనివారం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మన్మధరావు పరిశీలించారు. వీలైనంత త్వరగా కోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని అన్నారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని చెప్పారు. అనంతరం వివిధ అంశాలపై స్థానిక అధికారులతో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.